Breaking News

‘గుడ్ బుక్ రాస్తాం.. అండగా ఉంటాం’

Published on Thu, 10/10/2024 - 21:17

శ్రీకాకుళం, సాక్షి: శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడుగా  ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ కో ఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడుగా సీదిరి అప్పల రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ‘‘భవిష్యత్తు అంతా వైఎస్సార్‌సీపీ పార్టీదే. కూటమి పాలనలో పధకాలన్నీ కొట్టుకుపోయాయి. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని అన్నారు.

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. ‘‘పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. పార్టీ అధికారంలో లేనప్పుడు బరువు మోయడమే  అసలైన పని. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులుగా జగన్ పనిచేయమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం. 4 నెలలో ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రజలను పూర్తిగా మోసం చేశారు. నేను ఆముదాలవలసలోనే ఉంటా.. ప్రజల కోసమే పనిచేస్తా. అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ అన్ని ఆగిపోయాయి. నిత్యవసరాలు ఆకాశానంటుతున్నాయి. ధరల కంట్రోల్‌కి బడ్జెట్‌లోనే మేం నిధులు ఇచ్చేవాళ్లం. నాలుగు నెలలో రూ. 30 వేల కోట్లు అప్పుచేశారు. మెడికల్ సీట్లు ఇవ్వొద్దని  కేంద్రానికి లేఖ రాయడం ఎంత దారుణం?. పేదల విద్యార్దులకు సీట్లు రాకుండా చేయడానికే కదా. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. వరద సహాయం పేరుతో అక్రమాలు చేశారు’’ అని అన్నారు.

అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ, ‘‘ కార్యకర్తలు కసితో పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు మాయమాటలు చేబుతూనే వస్తున్నారు. బిర్యాని వస్తుందని పలావు  పెట్టే వారిని ఓడించారు. ఇప్పుడు పలావు, బిర్యానీ రెండూ లేవు. వంద రోజుల్లో ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. గుడ్ బుక్ రాస్తాం.. ప్రతీ కార్యకర్తకు  అండగా ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాడటం మొదలు పెడతాం’’ అని పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)