Breaking News

అరెస్ట్‌ ఖాయమంటూ కేజ్రీవాల్‌ కామెంట్స్‌ .. ఢిల్లీ సీఎం అతిశీకి అధికారిక లేఖ

Published on Sun, 12/29/2024 - 16:35

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తప్పక గెలవాల్సిన ఎన్నికల్లో ఫలితం తారు మారైతే మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) భవితవ్యం కూడా గందరగోళంలో పడనుండగా.. తాజాగా, కేజ్రీవాల్‌ ( Arvind Kejriwal) చేసిన ఆరోపణలతో అక్కడి రాజకీయం రంజుగా మారింది.

సీఎం అతిశీ (Atishi Marlena) త్వరలోనే అరెస్ట్‌ కానున్నారంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని ఢిల్లీ రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌ గోయల్‌ (Prashant Goyal) ఖండించారు.  కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. 

గత బుధవారం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ప్రస్తుత సీఎం అతిశీలు సంయుక్తంగా మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..ఆ ట్వీట్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రం (బీజేపీ పెద్దలు) సమావేశమైంది. సమావేశంలో తమ ప్రభుత్వం ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది. ఆ పథకాన్ని ఆపేందుకు కుట్ర పన్నింది. సీఎం అతిశీపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు అతిశీ ఇవ్వాళో, రేపో అరెస్ట్‌ కావొచ్చనే’ సమాచారం మాకు అందింది అని అన్నారు. ఆ మేరకు ట్వీట్‌ కూడా చేశారు.

కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్‌ గోయల్‌ (Prashant Goyal) స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఢిల్లీ సీఎం అతిశీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఉచిత బస్సు సర్వీసు పథకంపై విచారణ చేపట్టాలని ‘ది గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ’ (gnctd),విజిలెన్స్ విభాగం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. కాబట్టే కేజ్రీవాల్‌  పేర్కొన్న దావా పూర్తిగా తప్పుగా, తప్పుదారి పట్టించేది’అని గోయల్ తన లేఖలో పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌తో పాటు సీఎం అతిశీ మాట్లాడారు. నేను గట్టి నమ్మకంతో చెబుతున్నా. ఒక వేళ దర్యాప్తు సంస్థలు నాపై తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్‌ చేసినా చివరికి నిజమే గెలుస్తోంది. దేశ న్యాయ వ్యవస్థపై గట్టి నమ్మకం ఉంది. అరెస్టయినా బెయిల్‌పై బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.  

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)