Breaking News

ఢిల్లీ చట్టంపై మళ్లీ రగడ

Published on Wed, 08/16/2023 - 15:56

ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మధ్య మళ్లీ గ్యాప్‌ను పెంచుతోంది. దేశ రాజధానిలో పోస్టింగ్‌లు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న ‍అధికారాలను పక్కకు పెడుతూ కేంద్రం కొత్త చట్టాన్ని తెచచింది. దీనిపై చర్చించడానికి సీఎం కేజ్రీవాల్‌ అసెంబ్లీ సెషన్‌ను ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం కొత్త చట్టాలను తీసుకురావడంపై ఆప్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేశాయి. ఈ బిల్లును సుప్రీంకోర్టులోనూ సవాలు చేసింది ఆప్. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సెషన్‌లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్జీ సక్సేనా ఆగష్టు 11నే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖను పంపించారు. ఈ లేఖకు సంబంధించిన ఓ కాపీని ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అసెంబ్లీకి సమర్పించారు. 

 అసెంబ్లీ సమావేశాలు నియమాలకు అనుగణంగానే జరుగుతన్నాయని రాఖీ బిర్లా తెలిపారు. ఎప్పుడు సమావేశం కావాలనేది పూర్తిగా విధాన సభ విశేషాధికారమని పేర్కొన్నారు. క్యాబినెట్ పిలుపు మేరకే చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఎల్జీ సక్సేనా ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

మద్యం పాలసీపై కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేసిన సందర్భంలోనూ గత ఏప్రిల్‌లో అసెంబ్లీ సమావేశం అయింది. అప్పుడు కూడా ఎల్జీ సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు.  

ఇదీ చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)