Breaking News

ఢిల్లీ సీఎం ‍ప్రమాణానికి కేజ్రీవాల్‌కు ఆహ్వానం?

Published on Tue, 02/18/2025 - 13:42

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ నేత కేజ్రీవాల్‌ను సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి పిలుస్తారా లేదా అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతోంది. ఇప్పుడు దీనికి సమాధానం దొరికింది. బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమ్‌ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను, మరో మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.

నూతన సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి ఢిల్లీలోని లక్షమంది చోటామోటా నేతలను బీజేపీ ఆహ్వానించనుందని తెలుస్తోంది. అయితే కొత్త సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రమాణస్వీకారానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ నేతలు వినోద్‌ తావ్డే, తరుణ్‌ చుగ్‌, వీరేంద్ర సచ్‌దేవ్‌ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.

ఫిబ్రవరి 19న జరగబోయే బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎంగా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది వెల్లడికానుంది. తొలుత ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19న నిర్వహించాలని బీజేపీ అధిష్టానం భావించింది. తరువాత ఈ  కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిశ్చయించారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరుపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులను నియమించనున్నదని సమాచారం. ఈ పరిశీలకులు ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. వీటి ఆధారంగా పార్టీ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తుంది. కాగా  ముఖ్యమంత్రి  రేసులో న్యూఢిల్లీ ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, రేఖ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయని తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్‌

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)