సీఎం ఇంటి రిపేర్ల కోసం రూ.45 కోట్లు! మరి మోదీ రూ.8,400 కోట్ల విమానం సంగతేంటి..?

Published on Wed, 04/26/2023 - 15:05

న్యూఢిల్లీ: డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని రూ.45కోట్లు వెచ్చించి రినోవేట్ చేయించారని బీజేపీ ఆరోపించింది. ఆయన 'విలాసవంతమైన రాజు' అని విమర్శలు గుప్పించింది. ప్రజా ధనాన్ని కేజ్రీవాల్ తన లగ్జరీ లైఫ్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడింది. ఇదే విషయంపై ఆయన నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది.

అయితే బీజేపీ ఆరోపణలకు ఆప్ స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది. సీఎం ఉంటున్న ఇళ్లు 80 ఏళ్ల నాటిదని, ఇప్పుటికే పైకప్పు మూడు సార్లు కూలిపోయిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇలాంటి ఇంట్లో సీఎం ఉంటారా? మరమ్మతులు చేయించవద్దా? అని ప్రశ్నించింది.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ సమయంలో రూ.8,400 కోట్లు పెట్టి ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆప్ గుర్తు చేసింది. ఆయన ఇంటి మరమ్మతుల కోసం రూ.500 కోట్లు వెచ్చించిన విషయాన్ని ప్రస్తావించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి రిపేర్ల కోసం రూ.15కోట్లు వెచ్చించారని, గుజరాత్ సీఎం విమానం ఖరీదు రూ.191 కోట్లు అని ఎదురుదాడికి దిగింది.  ఆప్ నేత సంజయ్‌ సింగ్ ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు.
చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్‌ కలకలం.. ఆడియో క్లిప్‌ రిలీజ్‌ చేసిన అన్నామలై

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)