Breaking News

సీఎం అతిషిపై మళ్లీ నోరుజారిన బీజేపీ నేత

Published on Wed, 01/22/2025 - 11:22

న్యూఢిల్లీ:ఢిల్లీ బీజేపీ నేత రమేష్‌ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన సీఎం అతిషిని టార్గెట్‌ చేశారు. అతిషి తల్లిదండ్రులు పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్‌గురును సమర్థించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అతిషి తల్లిదండ్రులది భారత్‌ వ్యతిరేక మనస్తత్వమని అన్నారు.

అందుకే పార్లమెంట్‌పై దాడి చేసిన వ్యక్తిని కాపాడేందుకు వారు  ప్రయత్నించారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజి నియోజకవర్గం నుంచి బిదూరి సీఎం అతిషిపై బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిదిన ఫలితాలు రానున్నాయి.

కాగా, బిదూరి సీఎం అతిషి లక్ష్యంగా వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అతిషి తన తండ్రిని మార్చి మర్లెనా అనే పేరు నుంచి అతిషిసింగ్‌గా మారిందన్నారు. ఎన్నికలు రాగానే ఢిల్లీ వీధుల్లో అతిషి జింకలా పరుగులు పెడుతోందని మరో సందర్భంలో బిదూరి వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్‌ బిదూరియేనన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. 

ఇదీ చదవండి: ఆప్‌,బీజేపీల మధ్య చైనీస్‌ సీసీ కెమెరాల వివాదం

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)