Breaking News

సీఎం అతిషిపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Wed, 01/15/2025 - 16:25

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఢిల్లీ(Delhi)లో నేతల విమర్శలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అతిషి(Atishi)పై బీజేపీ సీనియర్‌ నేత రమేష్‌బిదూరి (Ramesh Bidhuri) తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నాలుగేళ్లుగా ఢిల్లీ సమస్యలను పట్టించుకోని అతిషి ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం ఢిల్లీ వీధుల్లో జింకలా పరుగెడుతున్నారని బిదూరి అన్నారు.

ఢిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. నగరంలో వీధుల పరిస్థితి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గడిచిన నాలుగేళ్లలో అతిషి ఎప్పుడూ ఈ సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అడవిలో జింకలా ఢిల్లీ వీధుల్లో ఆమె తిరుగుతున్నారని బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  అతిషి మర్లెనా తన తండ్రిని మార్చి అతిషి సింగ్‌గా మారిందని గత వారం కూడా బిదూరి అతిషిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా, రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద కామెంట్లు చేయడం బిదూరికి సర్వసాధారణమైపోయింది. బీఎస్పీ నేత డానిష్‌ అలీని దూషించడం మొదలు.. ఎంపీ ప్రియాంకా గాంధీపైనా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమయ్యారు.  దీనిపై బీజేపీ అధిష్టానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో కల్కాజి నియోజకవర్గంలో సీఎం అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తుండడం గమనార్హం. 

ఇదీ చదవండి: అతిషి, అల్కాలాంబా ఎవరు ధనవంతులు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)