Breaking News

Telangana: నేడు బీజేపీ తొలి జాబితా?

Published on Mon, 10/16/2023 - 05:29

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) తుది నిర్ణయం తీసుకోనుంది. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న సమా వేశంలో రాష్ట్ర పార్టీ నుంచి అందిన జాబితాపై చర్చించి తొలిజాబితా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. లేనిపక్షంలో మంగళవారం ఈ జాబి తా వెలువడవచ్చుననే చర్చ పార్టీలో సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ స్థాయిలో ముసాయిదా జాబి తా కూడా సిద్థమైన నేపథ్యంలో 40–45 మందితో అధ్యర్థుల తొలిజాబితా... లేదా ఏకాభిప్రాయం ప్రాతిపదికన అంతకంటే ఎక్కువ సీట్లకే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

తొలి జాబితాలో ఎవరుంటారో? 
అధికార బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో పాటు సగం మందికి పైగా బీ–ఫారమ్‌లు కూడా అందజేయగా, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా 55 మందితో తొలిజాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడో ప్రధానపార్టీ బీజే పీ అభ్యర్థుల జాబితాపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కాగా ఢిల్లీలో సీఈసీ సమావేశానికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు, రాష్ట్ర స్క్రీనింగ్‌ కమి టీ చైర్మన్‌ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి హాజరు కానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా అమ్మవారి భవానీ మాలను ధరించి, పదిరోజుల పాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండే బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ ఈ భేటీకి హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టతరాలేదు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)