Breaking News

Delhi Election: 150 సరిహద్దుల మూసివేత.. పారా మిలటరీ దళాల మోహరింపు

Published on Wed, 01/22/2025 - 09:04

న్యూఢిల్లీ: రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు,  గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలోని 150 సరిహద్దులను మూసివేశారు. ఈ 150 సరిహద్దుల్లోని 162 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు దిగ్బంధించారు.  ఈ ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలతో పాటు, స్థానిక పోలీసులు 24 గంటలు పహారా కాస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో 162 చోట్ల దిగ్బంధనాలు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసులు 175 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. హోం మంత్రిత్వ శాఖ నుండి 250 కంపెనీల పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగనున్నాయి. నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పికెట్లను ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ పోలీస్ ఎలక్షన్ సెల్ తెలిపిన వివరాల ప్రకారం రాజకీయ పార్టీల ర్యాలీలు, బహిరంగ సమావేశాల విషయంలో ముందుగా వచ్చిన వారికి  తొలుత అనుమతినిస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)