Breaking News

Delhi: రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు వీరే..

Published on Thu, 02/20/2025 - 07:58

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని బీజేపీ ప్రకటించింది. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో రేఖ గుప్తా పేరును ముఖ్యమంత్రి పదవికి ఖరారు చేశారు. తాజాగా రేఖా గుప్తాతో పాటు మరో  ఆరుగురు మంత్రులుగా ఈరోజు (ఫిబ్రవరి20)న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్లోంది. ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.

రేఖ గుప్తా (50) హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారు. రేఖ గుప్తా(Rekha Gupta) కుటుంబం 1976 సంవత్సరంలో ఢిల్లీకి  వచ్చింది. ఆమె భర్త పేరు మనీష్ గుప్తా. రేఖ గుప్తా ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆమె ఆప్‌కు చెందిన వందన కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించారు.

రేఖా గుప్తా తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University)లోని దౌలత్ రామ్ కళాశాల నుండి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె 1996-97లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఎంపిక కావడంపై బీజేపీ నేత  ప్రవేశ్ వర్మ  హర్షం వ్యక్తి చేశారు.

ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)