Breaking News

ఓడిపోయిన అనుభవం

Published on Mon, 12/04/2023 - 04:04

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ దిగ్గజాలకు ఓటర్లు షాక్‌ ఇచ్చారు. పలుమార్లు విజేతలైన సీనియర్లకూ పరాభవం తప్పలేదు. తిరుగులేదనుకున్న మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఆఖరుకు సీఎం కేసీఆర్‌ కూడా కామారెడ్డి ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చారు. మరోవైపు సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన నేతలు కూడా పరాజయం పాలయ్యారు. ఇలాంటి కొన్ని ఆసక్తికర ఫలితాలను పరిశీలిస్తే...
 
♦ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజా జీవితంతో పెనవేసుకున్న నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వరుసగా రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అపారమైన అనుభవం ఉంది. ఈసారి ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన ఆయన గజ్వేల్‌లో గెలిచినా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు. 
♦ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ హయాంలోనే సీనియర్‌ నేత. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఆరు పర్యాయాలు గెలిచిన నాయకుడు. ఈసారి మాత్రం పిన్న వయస్కురాలు, కొత్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని ఆయన్ను ఖంగు తినిపించారు. 
♦ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కి తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు రాజకీయ వారసత్వం ఉంది. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి, 2018లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్‌ మంత్రి వర్గంలో కీలక మంత్రి. కానీ ఈసారి తుమ్మల నాగేశ్వరరావు చేతుల్లో ఓటమి ఎదురైంది. 
♦ బండి సంజయ్‌ పరిచయం అక్కర్లేని బీజేపీ నేత. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి. కరీనంగర్‌ ఎంపీగా విజయం సాధించిన నేపథ్యం ఆయనది. కానీ ఈసారి కరీంనగర్‌ స్థానంలో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ మరో ఎంపీ ధర్మపురి అరవింద్‌దీ ఇదే పరిస్థితి.  
♦ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో కలిసి పోరాడిన చరిత్ర ఈటల రాజేందర్‌ది. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్‌ఎస్‌తో వివాదం రావడంతో బీజేపీలో చేరారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈసారి మాత్రం ఓటమి తప్పలేదు. 
♦ మంత్రి ఇంద్రకరణ్‌  రెడ్డి నిర్మల్‌ స్థానానికి 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ తరఫున 2014లో గెలిచారు. 2018లోనూ విజయం సాధించారు. ఈసారి మాత్రం కాంగ్రెస్‌ గాలికి పరాజయం తప్పలేదు. మరో సీనియర్‌ నేత జోగు రామన్నదీ ఇదే అనుభవం. ఆదిలాబాద్‌ స్థానంలో 2009 నుంచి విజయాలను నమోదు చేశారు. 2023 ఎన్నిక ఆయనకు ఓటమిని అందించింది. 
♦ ఉమ్మడి నిజామాబాద్‌లోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్‌ స్థానాల నుంచి మూడుసార్లు విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి కూడా అనుభవం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)