Breaking News

ఈటల నివాసానికి పోలీసులు.. భద్రతపై చర్చ

Published on Thu, 06/29/2023 - 11:03

సాక్షి, హైదరాబాద్‌: హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్‌ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. 

ఈ క్రమంలో ఈటల రాజేందర్‌ నివాసానికి డీసీసీ సందీప్‌ రావు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఈటల భద్రత అంశంపై ఆయనతో సమావేశమై అరగంట పాటు చర్చించారు. అనంతరం, ఈటల ఇంటి నుంచి డీసీపీ వెళ్లిపోయారు. ఇక, వీరి భేటి నేపథ్యంలో ఈటల భద్రతపై డీసీపీ సందీప్‌ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ చెప్పిన అంశాలను డీజీపీ వివరిస్తామని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. ఈటల ఇంటి పరిసరాలను అధికారులు నిన్న(బుధవారం) పరిశీలించారు. అయితే, ఈటల భద్రతను సమీక్షించాలని మంత్రి కేటీఆర్‌.. డీజీపీని ఆదేశించారు. దీంతో, రాజేందర్‌ భద్రత పెంపుపై డీజీపీ అంజనీకుమార్‌ నేతృత్వంలో సమీక్ష జరిగింది. మరోవైపు.. తన హత్యకు కుట్ర జరుగుతోందని, ప్రాణహాని ఉందని ఈటల ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలో ఈటలకు కేంద్రం వై కేటగిరి భద్రత పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది.

ఇది కూడా చదవండి: ఈటల భద్రతపై కేటీఆర్‌ ఆరా.. రంగంలోకి సీనియర్‌ ఐపీఎస్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)