Breaking News

దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి

Published on Thu, 03/21/2024 - 02:28

ముస్తాబాద్‌/గంభీరావుపేట(సిరిసిల్ల): వడగళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని, ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సర్వేలు, సమీక్షలు, నివేదికల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్, పోతుగల్, గన్నెవారిపల్లెల్లో ఇటీవల వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్‌ బుధవారం పరిశీలించి, రైతులను ఓదార్చారు.

గత ప్రభుత్వం ఫసల్‌ బీమా పథకాన్ని అమలుచేసి ఉంటే ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడేవారు కాదని అభిప్రాయపడ్డారు. పంటల బీమా పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని కోరారు.

ఎన్నికల కోడ్‌ వచ్చిందన్న కారణం చెప్పకుండా.. రైతులను ఆదుకునేందుకు ఎన్నికల కమిషన్‌తో మాట్లాడి సాయం చేయాలని సూచించారు. కాగా, ఈ ప్రభుత్వమైనా ఫసల్‌బీమాను అమలు చేస్తుందో.. లేదో చెప్పాలని కోరారు. కౌలు రైతులకు రూ.12 వేల సాయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ స్తంభం కూలి మృతిచెందిన ముస్తాబాద్‌కు చెందిన రైతు ఎల్సాని ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల బీజేపీ ఇన్‌చార్జి రాణిరుద్రమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, పలువురు స్థానిక నేతలు బండి సంజయ్‌ వెంట ఉన్నారు. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు