Breaking News

పాతపట్నంలో కొత్త రచ్చ

Published on Thu, 02/01/2024 - 05:24

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం తెలుగుదేశం పార్టీలో మరోసారి రచ్చ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి ఎంపిక సర్వే కలకలం రేపుతోంది. ఐవీఆర్‌ఓఎస్, ఎస్‌ఎంఎస్‌ పేరుతో జరుగుతున్న అభిప్రాయ సేకరణలో ఏది వాస్తవమో, ఏది నకిలీయో తెలియదు గాని రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. టిక్కెట్‌ ఆశిస్తున్న కలమట వెంకట రమణ, మామిడి గోవిందరావు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీరి మధ్య ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా బాహాబాహీకి దిగుతున్నాయి.  

ఇద్దరికన్నా నోటాకే ఎక్కువ అభిప్రాయాలు 
అధిష్టానం చేస్తుందో, ప్రైవేటు ఏజెన్సీలు చేస్తున్నాయో తెలియదు గానీ అభిప్రాయ సేకరణ పేరుతో నియోజకవర్గంలో రచ్చ నడుస్తోంది. ఒకసారి వెంకటరమణ, గోవిందరావు, కలమట సాగర్‌ పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా.. మామిడికి ఎక్కువ సానుకూలత ఉన్నట్టు వారిలో వారే ప్రచారం చేసుకున్నారు. మరోసారి వెంకటరమణ,  గోవిందరావు నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా ఇద్దరి కన్న నోటాకే ఎక్కువ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇంకోసారి జరిగిన అభిప్రాయ సేకరణలో మామిడి కన్న కలమటకు ఎక్కువ మద్దతు వచ్చినట్టు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేసుకుంటున్నారు. తాజాగా గోవిందరావు ప్రస్తావన లేకుండా వెంకటరమణ, జనసేన నాయకుడు గేదెల చైతన్య, నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరిగిందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

సోషల్‌ మీడియాలో రచ్చ 
మరోవైపు గోవిందరావు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై గోవిందరావు తనపై ఫేక్‌ ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాతపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు పెడతానని సోషల్‌ మీడియా వేదికగా వార్నింగ్‌  ఇచ్చారు. తమకు అనుకూలంగా వస్తే అసలైన సర్వే అని, వ్యతిరేకంగా వస్తే ఫేక్‌ సర్వే అని రెండు వర్గాలు సోషల్‌ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నాయి.  

కుమ్ములాటలు కొత్తకాదు..
పాతపట్నం టీడీపీలో కుమ్ములాటలు కొత్త కాదు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లిపోయింది. తరచూ పార్టీలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, వంశధార నిర్వాసితుల పరిహారాన్ని మింగేయడమేన కాకుండా ప్యాకేజీ కోసం ఎమ్మెల్యేగా ఉండి పార్టీ ఫిరాయించారని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణపై గోవిందరావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు.

దానికి ధీటుగా గోవిందరావుపై వెంకటరమణ వర్గం అంతే విమర్శలతో తిప్పికొడుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పేరుతో భూదందాలు చేశారని, ఆ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని, పార్టీ పెద్దలంతా తన వెనకే ఉన్నారంటూ గోవిందరావుపై విమర్శలు చేస్తున్నారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)