Breaking News

మిర్యాలగూడ, వైరా ఇస్తేనే పొత్తు

Published on Mon, 10/30/2023 - 03:17

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘మిర్యాలగూడతో పాటు వైరా సీటు ఇస్తే ఓకే.. ఈ రెండు స్థానాలు ఇవ్వకపోతే పొత్తు కుదరదు. రెండు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ తేల్చకపోతే మేము విడిగా వెళ్తాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మంగళవారం హైదరాబా ద్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటాయని, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరవుతారని తెలిపా రు. ఈ సమావేశాల్లోపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే తాము విడిగా పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. బాల్‌ కాంగ్రెస్‌ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించారు.

చిత్తశుద్ధి లేకనే ఇలా చేస్తున్నారు..
కాంగ్రెస్‌తో పొత్తు కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగాయని, తొలు త భద్రాచలం, పాలేరు, మిర్యాలగూ డెం, ఇబ్రహీంపట్నం, వైరా స్థానాలను అడిగామని తమ్మినేని తెలిపారు. భద్రా చలం సిట్టింగ్‌ స్థానం ఇవ్వడం కుదరద ని చెప్పారని, ఒక దశలో పాలేరు ఇస్తా మని చెప్పి.. తర్వాత వారి అభ్యర్థిని ప్రకటించారని అన్నారు. ఒక్కో మెట్టు దిగి భద్రాచలం, పాలేరు వదులుకున్నామని, చివ రకువారు ప్రతిపాదించిన వైరా, మిర్యాలగూడ సీట్ల కు అంగీకరించామని వివరించారు. మళ్లీ ఇప్పుడు వైరా స్థానం ఇస్తామని చెప్పలేదంటూ ఆ పార్టీకి చెందిన ఒక నేత మాట్లాడారని విమర్శించారు.

ప్రస్తుతం మిర్యాలగూడతో పాటు హైదరాబాద్‌ నగరంలో ఒక సీటు ఇస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నా రని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి సీపీఎంతో పొత్తుపై చిత్తశుద్ధి లేకనే అలా మాట్లాడుతున్నా రని, ఇది సరైంది కాదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, అది మద్దతిచ్చే పార్టీ గెలవొద్దనే విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా  ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ ముందుకొస్తే సంతోషమని వ్యా ఖ్యానించారు. తాజా పరిణామాలను సీపీఐ నేతల కు కూడా తెలియజేశామని చెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)