Breaking News

‘ఇండియా’లో బీఆర్‌ఎస్‌ లేకున్నా పొత్తు

Published on Thu, 07/20/2023 - 03:24

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇండియా’ కూటమిలో బీఆర్‌ఎస్‌ లేకపోయినా ఆ పార్టీతో పొత్తుకు సంబంధించి సీపీఐ, సీపీఎంకు ఎలాంటి సమస్య లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఆ కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు రాష్ట్రంలో కలిసి పోటీ చేసే అంశం తలెత్తదన్నారు.  ‘ఇండియా’ కూటమికి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితు లకు సంబంధం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కేరళ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెస్‌ కూటములే ప్రధా న ప్రత్యర్థులని, అలాగే పశ్చిమ బెంగాల్‌లో సైతం తృణమూల్‌ కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్థు లని, కానీ జాతీయ స్థాయిలో దేశం కోసం ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములుగా లేరా? అని కూనంనేని  ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య పోరాటం ఉన్నప్పటికీ దేశ ప్రజల ప్రయోజ నాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో ఒకటిగా ఉన్నామని వివరించారు.

ప్రీ పోల్, పోస్ట్‌ పోల్‌ పొత్తులు
కొన్ని ఎన్నికల ముందు (ప్రీ పోల్‌), కొన్ని ఎన్నికల అనంతర (పోస్ట్‌ పోల్‌) పొత్తులు ఉంటాయని కూనంనేని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నా మని, ఆ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించామని, ఈ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు.

26 నుంచి ’సేవ్‌ ఆర్టీసీ’ పేరిట నిరసన
ప్రమాదంలో పడిన ఆర్టీసీని రక్షించుకునేందుకు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ‘సేవ్‌ ఆర్టీసీ’ పేరు తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్య క్రమాలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తా మని కూనంనేని తెలిపారు. ఆగస్టు 7న ఇళ్లు, గుడిసెలకు పట్టాలివ్వాలనే డిమాండ్‌తో పాటు ఇతరత్రా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్‌లు ముట్టడిస్తామన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)