Breaking News

రామరాజ్యం అంటే అందర్నీ చంపడమేనా?

Published on Wed, 11/19/2025 - 18:14

సాక్షి, విజయవాడ: ఆపరేషన్‌ కగార్‌‍(Operation Kagar) నేపథ్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను సీపీఐ తీవ్రంగా ఖండించింది. కగార్ పేరుతో ఏకపక్షంగా పట్టుకొని చంపుతున్నారని మండిపడుతూనే.. కోర్టులు ఈ ఎన్‌కౌంటర్‌లను సుమోటోగా స్వీకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరుతుఉన్నారు. 

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కి ఎన్‌కౌంటర్‌ అంటే ఏంటో తెలీదు. మనుషులను చంపి జబ్బులు చరుస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లంతా అర్బన్ నక్సలైట్లు. రామరాజ్యం అంటే అందర్నీ చంపడమేనా?. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. మనుషుల్ని చంపడమే లక్ష్యంగా.. ఒక ఫ్యాషన్‌గా మార్చుకుంది. ఈ దాడులకు నిదర్శనం కామ్రేడ్ హిడ్మా హత్యే!. 

హిడ్మా సరెండర్ అవుతారు అనే వార్తలు వచ్చాయి. వాటిని అమిత్ షా ఖండించి.. ఒప్పుకోలేదు. కాల్పుల విరమణ చేసుకున్నాం అని ప్రకటించిన వారిని చంపడం అన్యాయం. దేశంలో చట్టాలు ఉన్నాయి. నేరాలు చేస్తే అరెస్టులు చేయాలి కానీ చంపడం ఏంటి?. అయినా మనుషులను చంపడం వల్ల సిద్ధాంతాలను.. భావాల్ని అంతం చేయలేరు. దేవ్ జి అలియాస్ తిరుపతి పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న వాళ్లను కోర్టులో హాజరుపరచాలి. 

.. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా హత్యలు చేస్తోంది. గడిచిన మూడేళ్లలో 1,200 మందిని చంపారు. మనుషులను చంపుతున్న వారికి మోదీ అమిత్ షాలు.. ఏదో ఇతర దేశాల మీద గెలిచినట్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వారి గురించి శ్వేత పత్రం విడుదల చేయండి. ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణకు ఆదేశించండి.

.. జరిగిన ఎన్‌కౌంటర్లపై కోర్టులు సుమోటోగా కేసులు తీసుకోవాలి. దేశానికి కోర్టుల మౌనం చాలా నష్టం చేస్తుంది. ప్రజలు ఉద్యమం చేస్తే మరో శ్రీలంక బంగ్లాదేశ్ అవుతది. మహా మహా ఘోరమైన నియంతలు హిట్లర్ లాంటివాళ్ళు కాలగర్భంలో కలిశారు. 

అడవిలో ఉన్న వాళ్లను మమ్ములను కలవకుండానే అంతం చేస్తున్నారు. మమ్ములను సంప్రదిస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సీపీఐ పార్టీ తరఫున న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాం. వామపక్ష పార్టీలను అందరం కలిసి ప్రజాపోరాటం చేయబోతున్నాం. రేపు(గురువారం, నవంబర్‌ 20) అన్ని వామపక్ష పార్టీలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేస్తాం అని కూనంనేని అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)