Breaking News

చంద్రబాబు, నితీష్‌పై బీజేపీకి అపనమ్మకమే: సీపీఐ నారాయణ

Published on Tue, 07/02/2024 - 12:28

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతుండవని హెచ్చరించారు రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం అని కామెంట్స్‌ చేశారు.

కాగా, సీపీఐ నారాయణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. బీజేపీ స్టీల్‌ప్లాంట్ అమ్మితే టీడీపీ సహకరిస్తుందా?. ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే.

రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం. ఏపీలో కూటమికి ఇలాంటి విజయం వస్తుందని చంద్రబాబు కూడా ఊహించి ఉండడు. కేంద్రంలో బీజేపీ చావు తప్పి బయటపడింది. మోదీ మెజారిటీ కూడా తగ్గింది. ప్రధానిగా మోదీ ఉండి.. మైనార్టీలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఇది సంతోషకరం. అపనమ్మకంతోనే నితీష్, చంద్రబాబులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంది. వీళ్లపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం వేరు.. రాష్ట్రంలో వేరు కాదు. మా దృష్టిలో రెండు ప్రభుత్వాలు ఒక్కటే. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తాను అంటే మేము వద్దంటామా?. కోడలు మగ బిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా? అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)