Breaking News

ఢిల్లీ: 12కు స్పష్టత.. 4కు తుది ఫలితం?

Published on Tue, 06/04/2024 - 06:56

ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఈవీఎంలు తెరవనున్నారు. 8.30 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్‌లు మొదలు కానున్నాయి.

ఓట్ల లెక్కింపు సమయంలో దాదాపు వెయ్యి సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రంలోని ఈవీఎంలపై నిఘా ఉంచుతాయి. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఇతర బ్యాలెట్ పేపర్‌లను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 100కు పైగా కెమెరాలు  ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల ఎన్నికల ఫలితాలపై మధ్యాహ్నం 12 గంటలకల్లా ఒక స్పష్టత వస్తుందని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అన్నారు.  

మే 25న ఢిల్లీలో జరిగిన లోక్‌సభ పోలింగ్‌లో 58.70 శాతం ఓటింగ్ జరిగింది. రెండు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచారు. ఢిల్లీలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)