Breaking News

హైడ్రామా.. నానా యాగీ.. టీడీపీ నేతల శవ రాజకీయం 

Published on Wed, 06/07/2023 - 08:21

ఒంగోలు అర్బన్‌: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీని బతికించుకునేందుకు ఆ పార్టీ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవను అడ్డుపెట్టుకుని.. నిస్సిగ్గుగా శవ రాజకీయాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెం గ్రామంలో సవలం సుధాకర్‌ భార్య హనుమాయమ్మ(48) అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన సవలం కొండలరావు(బుజ్జి) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటాడు.

కొన్నేళ్లుగా వీరి మధ్య భూ తగాదా ఉంది. అతను వచ్చినప్పుడల్లా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో హనుమాయమ్మ సోమవారం తన ఇంటి ముందు కూర్చుని ఉండగా.. కొండలరావు తన ట్రాక్టర్‌ నాగేలు అడ్డతో ఆమెను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె కింద పడటంతో వెనుక టైరుతో తొక్కించాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి.. హనుమాయమ్మ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఒంగోలు జీజీహెచ్‌ వద్ద మంగళవారం హైడ్రామా నడిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ హడావుడి చేశారు. పాత కక్షలు, కుటుంబ తగాదాలతోనే సదరు మహిళను హత్య చేశారని ఆ గ్రామ ప్రజలంతా స్పష్టంగా చెబుతున్నా, రాజకీయ రంగు పులుముతూ ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై, పోలీసులపై ఆరోపణలు గుప్పించారు.
చదవండి: నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదు 

ఆందోళన చేస్తున్న వారి వద్దకు స్వయంగా వచ్చిన ఆర్డీవో, టంగుటూరు తహశీల్దార్‌లు.. మానవతా దృక్పథంతో వీలైనంత మేర ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయినా టీడీపీ నేతలు వినిపించుకోకుండా నానా యాగీ చేశారు. టీడీపీ నేతల వైఖరిని కళ్లారా చూసిన వారంతా.. ఇదేం రాజకీయం అంటూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా, మహిళ మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం పూర్తయింది. మృతురాలి భర్త తన అన్న భార్యపై కూడా అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తూ.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)