Breaking News

ఫ్లెక్సీ వార్‌.. కొండా సురేఖ వర్సెస్ రేవూరి

Published on Sun, 10/13/2024 - 18:56

సాక్షి, వరంగల్‌: గీసుకొండ పీఎస్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.

ఈ  క్రమంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కొండా సురేఖ వర్గీయులు భారీగా చేరుకున్నారు. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

గీసుకొండ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. ఇక్కడి వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. పార్టీ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారం కాదు.. స్థానికతకు సంబంధించిన ఇష్యూ.. ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం.. సమన్వయం పాటించడం మంచిందని రేవూరి అన్నారు.

ఫ్లెక్సీ వార్.. గీసుకొండ పోలీస్ స్టేషన్ కు కొండా సురేఖ

ఇదీ చదవండి: సునీల్‌ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్‌

 

 

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు