Breaking News

లొల్లి చేస్తే దవడ పగలగొడతా: రేణుకా చౌదరి

Published on Wed, 09/13/2023 - 15:17

సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. బుధవారం జరిగిన వాగ్వాదం.. చివరకు కుర్చీలు విసురుకొని కొట్టుకునే వరకు వచ్చింది. ఈ గొడవతో చిర్రెత్తుకొచ్చిన సీనియర్‌ నేత రేణుకా చౌదరి.. దవడ పగలకొడతానంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. 

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో రసాభస నెలకొంది. మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరితో పాటు అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్,సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్, మానవతారాయ్ హాజరయ్యారు.

ఈ క్రమంలో మట్టా దయానంద్, మానవతరాయ్ వర్గాలకు సంబంధించిన అనుచరులు తమ నేతకు టికెట్ కేటాయించాలంటే తమ నేతకు టికెట్ కేటాయించాలని పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన తమకే టికెట్ రావాలని మానవతారాయ్ వర్గానికి సంబంధించిన అనుచరులు అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్‌ను కోరారు.

అటు మట్ట దయానంద్ వర్గం కూడా తమకే టికెట్ కేటాయించాలని సూచించడంతో పరస్పరం రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. రెండు వర్గాలు ఒకరికొకరు కుర్చీలు విసురుకోవడంతో కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి..తో సమావేశం మధ్యలో నుంచే రేణుక చౌదరి వెళ్లిపోయారు. అనంతరం ఆమె ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ కార్యాయలంలో ప్రెస్‌ మీట్‌ పెట్టారు. 

‘‘కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో ఇంకోసారి గొడవపడితే ఊరుకోం. గొడవపడితే నేనే దవడ పగలకొడతా. కార్యకర్తల బలంలేని నాయకులే ఎక్కువగా మొరుగుతారు’’ అంటూ తీవ్ర స్థాయిలో గ్రూప్‌ రాజకీయాలపై మండిపడ్డారామె. 

మరోవైపు ఇప్పటికే సత్తుపల్లి కాంగ్రెస్‌లో నాలుగు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు టికెట్ ఆశిస్తున్నారు. కొండూరు సుధాకర్, మానవతారాయ్, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖ, మట్టా దయానంద్ టికెట్ తనకొస్తుందంటే తనకొస్తుందని ధీమాతో ఉన్నారు.

చదవండి: కిషన్‌రెడ్డి నిరాహార దీక్ష.. కేసీఆర్‌పై సీరియస్‌

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)