Breaking News

మాదిగలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు

Published on Sat, 03/23/2024 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదిగలకు రిజర్వేషన్ల విషయంలో కుట్ర జరుగుతోందని, రాజ్యాంగ బద్ధమైన మాదిగల హ క్కులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.సంపత్‌కుమార్‌ అన్నారు. మాదిగల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముందడుగు పడిందని, ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగనే చెప్పారని గుర్తు చేశారు.

రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీలు పదేళ్ల పాటు తెలంగాణ మాదిగలకు అన్యాయం చేశాయని, అప్పుడు తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల పక్షాన గొంతు వినిపించామని పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్, అధికార ప్రతినిధి జ్ఞానసుందర్‌లతో కలసి మీడి యాతో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కోసం వేసిన అన్ని కమిషన్లు కాంగ్రెస్‌ హయాంలోనివేనని చెప్పారు. కానీ, మంద కృష్ణ మాదిగ మాత్రం ద్రోహులతో కలసి మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని, ఆయన బీజేపీ ముసుగులో ఉండి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాదిగల ప్రయోజనాలను మోదీ కాళ్లముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అయితే కాంగ్రెస్‌ బడుగు, బలహీన వర్గాల పార్టీల అని సంపత్‌ అన్నారు.

నాకు టికెట్‌ ఇవ్వకపోయినా బాధ లేదు
నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా బాధ లేదని సంపత్‌ చెప్పారు. తనకు కాంగ్రెస్‌ పార్టీయే గాడ్‌ఫా దర్‌ అని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సామాజిక స్పృహతో పనిచేస్తున్నారని అన్నారు. కానీ, మాదిగ జాతికి అన్యాయం జరిగితే జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడైనా అధిష్టానానికి లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)