Breaking News

నలుగురికే లైన్‌క్లియర్‌ 

Published on Sat, 03/09/2024 - 04:09

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ హైకమాండ్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్‌ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం వెల్లడించారు.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌రెడ్డి, జహీరాబాద్‌ నుంచి సురేశ్‌ షెట్కార్, నల్లగొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌ రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ పోటీ చేయనున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోక్‌సభ స్థానాలు కేటాయిస్తామంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ అధిష్టానం.. ప్రస్తుతం ప్రకటించిన నలుగురు అభ్యర్థులకు తొలి జాబితాలోనే చోటు కల్పించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)