Breaking News

శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్‌

Published on Wed, 05/08/2024 - 14:48

ఢిల్లీ:  భారత దేశంలోని భిన్నత్వంపై శ్యామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఆయిన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి. ‘భారత దేశంలోని భిన్నత్వం గురించి శ్యామ్‌ పిట్రోడా అటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దృరదృష్టం. ఆమోదించదగినవి కావు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు’అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత  జైరాం రమేష్‌ ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చారు.

 

‘భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది.  తూర్పు వైపు ఉన్న ప్రజలు చైనా వారిని పోలి ఉంటారు. దక్షిణం వైపు ఉన్న ప్రజలు అరబ్‌ వారిలా ఉంటారు. ఉత్తర దిక్కు వాళ్లు అయితే నల్లగా లేదా తెల్లగా ఉంటారు. దక్షిణ భారతంలోని ప్రజలు అఫ్రికా వారిలా కనిపిస్తారు’అని శ్యామ్‌ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో భారత్‌లో భిన్నత్వం గురించి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. శ్యామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు జాత్యహంకారంతో కూడినవి బీజేపీ నేతలు మండిపడ్డారు.

ఈ వ్యవహారంపై  ప్రధాని మోదీ సైతం స్పందించారు. తెలంగాణలోని వరంగల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మాట్లాడారు. ‘ శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ  సమాధానం చెప్పాలి.  శరీర వర్ణం పేరుతో  దేశ ప్రజలను ఎవరైనా అగౌరవ పరిస్తే.. ఎట్టిపరిస్థితుల్లో సహించబోము. మోదీ ఇలాంటి వాటిని అస్సలు సహించరు’అని మోదీ మండిపడ్డారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)