Breaking News

65 దాటితే 'నో' పదవి

Published on Thu, 04/24/2025 - 01:27

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిల్లోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం మూడు దశల్లో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయసేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. 

పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటినవారికి బ్లాక్, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదని, ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ దిశానిర్దేశం చేశారు. 

ఇదీ షెడ్యూల్‌..: ⇒ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున 70 మందిని పార్టీ పరిశీల కులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు ఆయా జిల్లాల్లో జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. 
 ⇒  బ్లాక్, మండల అధ్యక్ష పదవుల  కోసం పేర్లను పీసీసీ ఇచ్చిన ఫార్మాట్‌లో సేకరించాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం 5, బ్లాక్‌ అధ్యక్షుల కోసం 3, మండల అధ్యక్షుల కోసం 5 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. 

 ⇒ మే 3 నుంచి 10 వరకు మరోమారు సమావేశం నిర్వహించి సంవిధాన్‌ బచావో సభలను నిర్వహించాలి. మే 4 నుంచి 10 వరకు ఆయా జిల్లాల్లో అసెంబ్లీ/బ్లాక్‌ స్థాయి నేతల సమావేశం నిర్వహించాలి. బ్లాక్, మండల కమిటీల ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గం పేర్లను సేకరించాల్సి ఉంటుంది.
 ⇒ మే 13 నుంచి 20 వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గ్రామ కమిటీల కోసం పేర్లను సేకరించాలి. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కూడా ఐదు పేర్లను తీసుకోవాల్సి ఉంటుంది. 
 ⇒ మూడు దశల సమావేశాల అనంతరం బ్లాక్, మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రతిపాదనలతో కూడిన నివేదికను పీసీసీకి సమర్పించాలి. 

 ⇒ ఈ కమిటీల్లో ఖచ్చితంగా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని మీనాక్షి నటరాజన్‌ స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఎందుకు ఇవ్వాలనే అంశాలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆమె ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గుజరాత్‌ పీసీసీ విధానాన్ని మోడల్‌గా తీసుకోవాల సూచించారు. పరిశీలకుల హోదాలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసే బాధ్యతలు చాలా కీలకమైనవని, ఈ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కోరారు.

లేటుగా వచ్చినవారు ఇంటికే.. 
పరిశీలకుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినవారిని బాధ్యతల నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్‌ ఆదేశించారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి కొందరు పరిశీలకులు అరగంట ఆలస్యంగా వచ్చారు. మరికొందరు రాలేదు. మొత్తం 70 మంది రావాల్సి ఉండగా, 58 మంది హాజరయ్యారు. దీంతో ఆలస్యంగా వచ్చిన వారు, సమావేశానికి రాని వారిని మీనాక్షి ఆదేశాల మేరకు పరిశీలకుల బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సమావేశంలోనే ప్రకటించారు. పరిశీలకులుగా ఆరుగురు మాత్రమే మహిళలను నియమించడంతో ఇంకా మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మీనాక్షి సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)