Breaking News

అసలు కట్టప్పలు వేరే ఉన్నారు: ఉత్తమ్‌

Published on Sat, 05/20/2023 - 08:12

సాక్షి, సూర్యాపేట: సామాజిక మాధ్యమాల్లో తనతో పాటు తన సతీమణి పద్మావతిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దీని వెనుక పార్టీకి చెందిన ముఖ్యుల హస్తం ఉందని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌లలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

తన ఫిర్యాదుతో అరెస్టయిన వారు చిన్న వారని, వారి వెనుక ఉన్న అసలు కట్టప్పలు త్వరలో బయటకు వస్తారన్నారు. తన సతీమణి పద్మావతి ఎయిర్‌పోర్టులో యాధృచ్చికంగా కొంత మంది బీఆర్‌ఎస్‌ మహిళా నేతలను కలుసుకుంటే.. ఆమె బీఆర్‌ఎస్‌ నేతలకు ఢిల్లీలో వసతి కల్పించారంటూ ఎయిర్‌పోర్టు ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఉత్తమ్‌ అన్నారు.

కొంత కాలంగా తమను కావాలనే బదనాం చేస్తున్నారని, వారిని వదిలేది లేదని స్పష్టంచేశారు. తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదన్నారు. ‘మీ అందరికీ తెలుసు. మాకు పిల్లలు లేరు. మీరే మా కుటుంబం అని రాజకీయం చేస్తున్నాం. మాకు వేరే వ్యాపకం, వ్యాపారం లేదు. 24 గంటలూ ప్రజా జీవితం, రాజకీయమే’అని ఆయన తెలిపారు.  

కోదాడలో 50 వేల మెజారిటీ రావాలి.. 
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి అధికార పార్టీని చిత్తుగా ఒడిద్దామని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. కోదాడలో 50 వేల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవాలని, 50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ సమావేశాలలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.   
చదవండి: ఢిల్లీకి నేతల క్యూ

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)