Breaking News

‘SIR పేరుతో ఈసీ చేస్తున్న దారుణాన్ని మేము ప్రశ్నించాం’

Published on Thu, 08/14/2025 - 18:19

హైదరాబాద్: ‘SIR’(స్పెషల్‌ ఇంటిన్స్‌వ్‌ రివ్యూ) పేరుతో భారత ఎన్నికల సంఘం చేస్తున్న దారుణాన్ని తాము ప్రశ్నించామని భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.  ఒకవేల 65 లక్షలు ఓటర్లను తొలిగించినట్లయితే ఎందుకు తీసేస్తున్నారో వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ సుప్రీం కోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ...తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో గడిచిన రెండు వారాలుగా పార్లమెంటు సభ్యులం....ఈ స్పెషల్‌ ఇంటిన్స్‌వ్‌ రివ్యూపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుపడుతూ వస్తున్నాం. స్పీకర్‌ ఈ విషయంపై దృష్టి పెట్టకుండా సభను వాయిదా వేస్తూ వచ్చారు.

ఇవాళ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో....మనం ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం అనేది ఒక కీలకమైన విభాగం. రాజ్యాంగ బద్దంగా స్వతంత్రంగా పని చేయాల్సిన ఈ సంస్థ ప్రలోభాలకు లోనైతే తీరని నష్టం వాటిల్లుతుంది. పౌరసత్వం, మతం పేరున ఎన్నికల సంఘం ఓటర్లను తొలిగించలేదు. ఒకవేల ఓటర్లను తొలిగించాలంటే ఎందుకు తొలిగించారో...చెప్పాల్సి ఉంటుంది. రాహుల్‌ ఇటీవల ఇచ్చిన ప్రజంటేషన్‌ ద్వారా ఓటర్ల జాబితాలో లోపాలు సుస్పష్టంగా వెలుగులోకి వచ్చాయి. 

అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలో చనిపోయిన వారిని బతికి ఉన్నట్లు, బతికి ఉన్న వారు చనిపోయినట్లు తప్పులు తడకలుగా జాబితా ఉంది. భారత్‌లో ఎన్నికల సంఘం చాలా స్పష్టతతో న్యూట్రల్‌గా పని చేయాల్సి ఉంది.  సుప్రీం కోర్టు ఇవాళ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్ఠం చేస్తున్నాయి.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తామంతా సంతోషిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనందరిపై ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)