Breaking News

వరంగల్‌ కాంగ్రెస్‌లో పవర్‌ వార్‌..

Published on Thu, 10/17/2024 - 06:13

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవకుండానే వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గం వేదికగా పార్టీలో అంతర్గత లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా నుంచి కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖపై హను మకొండ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీకి ఫిర్యాదులు చేయడం గమనార్హం. పరకాల నియోజకవర్గంలో ఇప్పటికే కొండా సురేఖ, ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిల మధ్య విభేదాలు బహిర్గతం కాగా, ఇప్పుడు పార్లమెంటు పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలు కూడా జత కలిశారు.

మంత్రి సురేఖ తమ నియోజ కవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తమకు నష్టం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ వీరంతా పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి వినతిపత్రం అందజేశారని, తమ నియోజకవర్గాల్లో కలుగజేసుకోకుండా మంత్రి సురేఖను నియంత్రించాలని కోరారని తెలుస్తోంది. దీనికి ముందు మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీని కూడా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేయడం గమనార్హం. 

వివాదాస్పదమవుతున్న సురేఖ వ్యవహార శైలి
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి ఇటీవలి కాలంలో వివాదాలకు దారితీస్తోంది. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో వివాదం పార్టీకి తలనొప్పిగా మారింది. వరంగల్‌ పార్లమెంటు పరిధిలోని ఇతర ఎమ్మెల్యేలతో సైతం సఖ్యత కొరవడటం తాజాగా చర్చనీయాంశమవుతోంది. దీంతో సురేఖ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆసక్తి కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇటీవలి పరిణామాలు ఆమె భవితవ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)