Breaking News

పవన్‌.. క్షమాపణ చెప్పాల్సిందే: అనిరుధ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 12/03/2025 - 09:57

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే  అనిరుద్ రెడ్డి మరో సారి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు ఏం చేయలేరని అనుకుంటున్నావా? అంటూ ప్రశ్నలు సంధించారు. తెలంగాణ పౌరుషం ఉన్న ప్రతీ ఒక్కరూ పవన్ మాటలను ఖండించాల్సిందే అని కామెంట్స్‌ చేశారు.

జడ్చర్ల ఎమ్మెల్యే  అనిరుద్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటివరకు ఎందుకు క్షమాపణ చెప్పడం లేదు. పవన్‌ క్షమాపణ చెప్పేంత వరకు జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన సినిమా మాత్రం ఆడనిచ్చేది లేదు. తెలంగాణ పౌరుషం ఉన్న ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ మాటలను ఖండించాల్సిందే. తెలంగాణ ప్రజలను నర దిష్టి అంటూ రాక్షసులతో పోల్చడం కరెక్ట్ కాదు. నేను పవన్ ఫ్యాన్ అయినా తెలంగాణను చులకనగా చూస్తాను అంటే సహించేది లేదు.

మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు రేట్లు పెంచాలంటే 20 శాతం కార్మికులకు ఇవ్వాలని నిబంధనపై జీవో ఇవ్వాలి. మిగతా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణ ప్రాంతం విషయంలో ఒకతాటిపై ఉందాం. ఇప్పటికే స్పందించిన నేతలందరికీ కూడా నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కామెంట్స్‌ చేశారు. 

అంతకుముందు కూడా పవన్‌పై అనిరుధ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సింగిల్‌గా ఎన్నికలకు పోయే దమ్ము లేకనే పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చిరంజీవి లేకపోతే పవన్‌ను ఎవ్వరూ చూడరని అన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు కొంటున్నావనే ప్రచారం జరుగుతోందని, తెలంగాణ ప్రజలంటే అంత చిన్న చూపా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లోని ఆస్తులు అమ్మేయాలని ఛాలెంజ్‌ చేశారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్‌లో ఎందుకుంటున్నావని ప్రశ్నించారు. విజయవాడలో ఉండి, ఏపీ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా నీకు? అంటూ పవన్‌ కల్యాణ్‌ను నిలదీశారు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)