Breaking News

యూత్‌ కాంగ్రెస్‌ ‘నారాజ్‌’

Published on Wed, 10/25/2023 - 04:17

సాక్షి, హైదరాబాద్‌: టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో యూత్‌ కాంగ్రెస్‌ నాయకత్వం నారాజ్‌ అవుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ యూత్‌ కోటాలో 3–7 టికెట్లు కేటాయిస్తారని, కానీ ఈసారి మాత్రం తమను పరిగణనలోకి తీసుకోకపోవడంతో యూత్‌ కాంగ్రెస్‌ నేతలు నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఇందుకు నిరసనగా యూత్‌కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని భావిస్తున్నారు. ఈసారి యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి వనపర్తి టికెట్‌ ఆశిస్తున్నారు.

ఒకవేళ వనపర్తి కాకపోయినా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లుగా యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అనేక పోరాటా లు చేసి విద్యార్థులు, యువత పక్షాన నిలబడ్డామని, ఈ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. తద్వారా యువకులకు పార్టీ ప్రాధాన్యతమిస్తుందనే సంకేతాలను పంపాలని చెబుతున్నారు. వనపర్తితో పాటు దేవరకొండ, అంబర్‌పేట లాంటి సీట్లను తమకు కేటాయించాలని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు కోరుతున్న నేపథ్యంలో అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే.

నేడు ‘బుజ్జగింపు’ భేటీ?
యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణ యించారు. అయితే, చాలామంది యూత్‌కాంగ్రెస్‌ నేతలు నిరాశలో ఉన్న మాట వాస్తవమేనని, వారందరూ రాజీనామాలు చేయాలనే భావనలో ఉన్నప్ప టికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్‌లోనే ఉంటారని, వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)