Breaking News

అధికారులు మాట వినడం లేదట!.. టీపీసీసీ చీఫ్‌కు కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

Published on Sat, 09/21/2024 - 17:55

సాక్షి, హైదరాబాద్‌: అధికారులు తమ మాట వినడం లేదంటూ కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నామో.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల వ్యవహారాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులకు మహేష్‌గౌడ్‌ అప్పగించారు. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదాపూర్‌ రాడియంట్‌ హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

మరోవైపు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సమీక్షలు చేపడుతోంది. పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్‌కుమార్‌గౌడ్‌ నేతృత్వంలో శనివారం నుంచి జిల్లా స్థాయి సమీక్షలు ప్రారంభమయ్యాయి.

ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్థితిగతులు, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరు, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ అంశాల ప్రాతిపదికగా ఈ సమీక్షలు జరుగుతాయని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో పార్టీ అన్ని స్థాయిల నాయకులు పాల్గొననున్నారు.

	చీఫ్ కు పార్టీ నేతల ఫిర్యాదు..

 

 

 

 

 

 

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు