Breaking News

టికెట్‌ ఇస్తే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తా..

Published on Sat, 08/05/2023 - 09:22

చిలకలగూడ: అధిష్టానం ఆదేశిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు నాగులూరి సాయిబాబా అన్నారు. చిలకలగూడ సాయిలత ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టానని, ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  

అధిష్టానం తనకు టికెట్‌ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని, వేరొకరికి టిక్కెట్‌ ఇచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్‌ అభ్యర్థి విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించే వ్యక్తిగా స్థానికుడైన నాగులూరి సాయిబాబా అన్నివర్గాల ప్రజలకు సుపరిచితుడని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడు అచ్యుత రమేష్‌ బాబు అన్నారు.

కార్యక్రమంలో ఎస్‌సీ సెల్‌ ప్రతినిధులు దేవుడు వెంకటేష్, ప్రవీణ్‌కుమార్, కమలాకర్, అరుణ్‌కుమార్, రాజు, కాంగ్రెస్‌ నాయకులు తుమ్మశ్రీను, సతీష్, ప్రమోద్,  ఆంజనేయులు, రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)