Breaking News

‘కాంగ్రెస్‌కు ముని మనవడు వయస్సున్న పార్టీ మీది’’

Published on Fri, 05/30/2025 - 19:39

హైదరాబాద్‌:  గాంధీ కుటుంబం గురించి బీజేపీ నేతలు తప్పుగా మాట్లాడుతున్నారంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మండిపడ్డారు.  నిజాయితీ, నీతి, త్యాగం, ప్రేమ కల్గిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఒక నేత రాహుల్‌ గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు. అటువంటి వారిపై బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడటం తగదన్నారు. బీజేపీ ఎంపీ రఘనందన్‌ రావుకు గౌరవం ఇస్తానని, కానీ  ఆయన లిమిట్స్‌ దాటి మాట్లాడుతున్నారంటూ హెచ్చరించారు. కిషన్‌ రెడ్డి  మొట్టికాయలకు రఘునందన్‌ మైండ్‌ బ్లాండ్‌ అయ్యిందని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. 

సర్దార్ పటేల్ మావాడు అంటుంన్నారు...
‘1885 లో కాంగ్రెస్ ఆవిర్బవించింది... బీజేపీ పుట్టింది 1980. కాంగ్రెస్ చరిత్రకు బీజేపీ  చరిత్రకు వంద ఏళ్ళ తేడా ఉంది. బీజేపీ పుట్టి కేవలం 45 ఏళ్ళు అయింది. కాంగ్రెస్‌కు ముని మనవడు వయస్సున్న పార్టీ మీది. మోతీలాల్ నెహ్రూ , జవహర్ లాల్ నెహ్రూ , ఇంధిరా గాంధీ ... వీరంతా స్వాతంత్ర్యానికి ముందు పుట్టిన వారే.  మోదీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ,రణమఘునందన్ రావు స్వాతంత్యం తర్వాతే పుట్టారు. 

రఘనందన్ రావు చరిత్ర తెలుసుకో... రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. చరిత్ర పై చర్చ చేసే దమ్ము ఉందా?, గాంధీ కుటుబం ఏలిన రోజు... బీజేపీ లో ఇప్పుడు విమర్శిస్తున్న వారు ఇంకా పుట్టలేదు. స్వాతంత్ర్య వచ్చిన నాడు పరిస్థితులు ఎలా ఉండెనో ఎవరికి తెలుసు.నెహ్రూ ప్రధాని అయిన తర్వాత 545 సంస్థానాలకు భారత్‌లో విలీనం చేశారు. మీకు ఎవరు దిక్కు లేక సర్దార్ పటేల్ మావాడు అంటుంన్నారు. 

కాశ్మీర్‌ను కాపాడింది నెహ్రూనే..
కాశ్మీర్ భారత్ నుంచి విడిపోకుండా నెహ్రూ కాపాడాడు. బీజేపీ నేతలకు ఆదిత్య 369 సినిమా లోలాగ టైం మిషన్ లో వందేళ్లు వెనక్కి తీసుకుపోవాలి. బీజేపీకి ఎజెండా లేదు... కాంగ్రెస్ సముద్రం లోని ఓక బిందె నీళ్లు తీసుకొని జీవిస్తున్నారు. ఆ బిందెడు నీల్లే సర్దార్ వల్లబాయి పటేల్’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు.

గాంధీ భవన్‌ అటెండర్ పోస్ట్ ఇచ్చినా పనిచేస్తా
కొత్త కమిటీ ల కూర్పు చాలా అద్బుతంగా ఉంది. సామాజిక న్యాయం ప్రాధాన్యత ఇచ్చారు. పీఏసీ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు పెడితే అయిపోతుండే. జగ్గారెడ్డికి ఏ కమిటీలో ఇచ్చినా సంతోషమే. గాంధీ భవన్ అటెండర్ పోస్ట్ ఇచ్చినా పనిచేస్తా. జానారెడ్డి ఉన్న కమిటీ లో నాకు అవకాశం ఇచ్చారంటే నాకు ప్రమోషన్ ఇచ్చినట్లే.’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)