Breaking News

‘ఆప్‌’తో పొత్తు..కాంగ్రెస్‌ నేత కీలక వ్యాఖ్యలు

Published on Sat, 01/18/2025 - 20:20

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Elections) ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌), కాంగ్రెస్‌(Congress) పార్టీల మధ్య శాశ్వతంగా దూరం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అవసరమైతే ఆప్‌(AAP)నకు మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ పార్టీతో కాంగ్రెస్‌కు భవిష్యత్తులో ఎటువంటి పొత్తు అక్కర్లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మాకెన్‌ చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌,ఆప్‌ విడివిడిగానే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌,బీజేపీ(BJP) మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్‌ పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఇండియా కూటమిలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలో ఆప్‌ సహా ఒక్కొక్కటిగా ఇటీవల కాంగ్రెస్‌కు దూరమవుతుండడం గమనార్హం. 

ఈ వ్యవహారంపై ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ(ఎస్‌సీపీ) పార్టీ అధినేత శరద్‌పవార్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పొత్తు లోక్‌సభ ఎన్నికలవరకేనని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొత్తు ఉండాలని ఏమీ లేదన్నారు. 

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీ(ఎస్పీ) కూడా ఇటీవల కాంగగ్రెస్‌ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్‌కు కాకుండా ఆమ్‌ఆద్మీపార్టీకి మద్దతిస్తుండడం గమనార్హం. ఎస్పీ బాటలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఆప్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించింది.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అదే నెల 8వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని ఆప్‌ భావిస్తుండగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ఆప్‌కు చెక్‌ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఈ ఎన్నికల కోసం తన తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్‌ ఆ మేనిఫెస్టో తమదేనని, బీజేపీ కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)