Breaking News

కర్ణాటకలో సీఎం మార్పు?.. సిద్ధరామయ్యకు నో అపాయిట్మెంట్‌

Published on Mon, 11/10/2025 - 15:45

ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానంతో భేటీ కావాలని ప్రయత్నించినా, కాంగ్రెస్‌ సీనియర్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటుండగా.. నవంబర్‌లో సీఎం మార్పు జరిగే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ గత కొన్ని నెలలుగా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

తాజా పరిణామాల్లో, సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లినా, పార్టీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. అయినా కూడా, సిద్ధరామయ్య ఢిల్లీలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, కర్ణాటకలో జరిగిన ఓ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, తన ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, రాబోయే రెండున్నరేళ్లూ తామే అధికారంలో ఉంటామని, తదుపరి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌దే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, సిద్ధరామయ్య శిబిరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆయన సోదరుడు, కొప్పల్ ఎంపీ రాజశేఖర్ హిట్నాల్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఇది పేరుకే విందు అయినా.. అంతర్గతంగా సిద్ధరామయ్య బల ప్రదర్శనగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)