Breaking News

కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్

Published on Mon, 05/06/2024 - 20:37

సిమ్లా: దేశంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. కాంగ్రెస్ మేనిఫెస్టోను విదేశీ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ చాలా దిగజారిపోయిందని అన్నారు.

సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో వినాశకరమైన వరదలు, వర్షాల సమయంలో చురుకైన పాత్ర పోషించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.

రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తామని, వాయనాడ్‌ బరిలోకి దిగారు. ఇప్పుడు రాయ్‌బరేలీ నుండి పోటీ చేస్తున్నారు. రాయ్‌బరేలీ నుంచి కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఠాకూర్ అన్నారు. తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల్లో గెలుపొందడం అనే మూర్ఖుల స్వర్గంలో జీవించడం కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు. జూన్ 4న విడుదలయ్యే పోలింగ్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ కలలు చెదిరిపోతాయని పేర్కొన్నారు.

అనురాగ్ ఠాకూర్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో హమీర్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన నాలుగు లక్షల ఓట్ల కంటే ఈసారి మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 400 సీట్లకు పైగా సొంత చేసుకుంటుందని కూడా అన్నారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)