కాంగ్రెస్‌కు లోక్‌సభ అభ్యర్థులు కరువు.. ముఖం చాటేస్తున్న కీలక నేతలు

Published on Mon, 03/11/2024 - 19:45

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్‌లో వింత పరిస్థితి చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు కరువయ్యారు. దీంతో చేసేది లేక పలువురు మంత్రులనే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించేలా వారిని బుజ్జగించేందుకు పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగిందంటూ పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.  

ఈ తరుణంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలని పార్టీలో చర్చలు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, హోంమంత్రి జి పరమేశ్వర అన్నారు.

స్క్రీనింగ్‌ కమిటీ తర్వాతే క్లారిటీ
అయితే లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది పార్టీ అంతిమంగా నిర్ణయిస్తుందని ఆయన..మంత్రుల్లో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలనే చర్చలు జరుగుతున్నాయని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే అంగీకరిస్తారో వారినే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపుతామని, నేటి సమావేశం (స్క్రీనింగ్ కమిటీ) తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరమేశ్వర చెప్పారు. 

ఢిల్లీకి జాబితా
కాగా, అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.‘మేము సాయంత్రం సమావేశం అవుతున్నాం. అభ్యర్థిని ప్రకటించే హక్కు మాకు లేదు. ప్రతిపాదనల్ని ఢిల్లీకి పంపుతాం. కేంద్ర ఎన్నికల కమిటీ అక్కడ సమావేశమవుతుంది.మా సిఫార్సును ఆమోదించొచ్చు. లేదంటే తిరస్కరించొచ్చు. జాబితాలో కొత్త పేర్లను చేర్చొచ్చు’ అని చెప్పారు. 

తొలిజాబితాలో ఏడు స్థానాలకు 
కాంగ్రెస్ తొలి జాబితాలో కర్ణాటకలోని ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ తొలి జాబితాలో మంత్రులు,ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించలేదు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)