Breaking News

డిసెంబర్‌లో అధికారంలోకి కాంగ్రెస్‌

Published on Sat, 08/26/2023 - 02:02

సాక్షి, హైదరాబాద్‌: తన అంచనా ప్రకారం ఈ ఏడాది నవంబర్‌ 30న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉంటుందని, డిసెంబర్‌ మొదటి వారంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి దోపిడీ, అక్రమార్జనలపైనే దృష్టి పెట్టిందని, అందుకే ఈసారి తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు.

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ టికెట్‌కోసం శుక్రవారం గాందీభవన్‌లో దరఖాస్తు ఇచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయమన్నారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ అని బీఆర్‌ఎస్‌ నేతలు చెపుతున్నారని, వారు చెపుతున్నట్టుగానే తలసరి అప్పు, మద్యం వినియోగం, అవినీతిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని 119 ముక్కలుగా విభజించి ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నేతలు వాటిని తమ సామ్రాజ్యాలుగా భావించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితబంధు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయకముందే లంచాలు తీసుకుంటున్నారని, హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో దళితబంధుకు అర్హత పొందిన వారి వద్ద నుంచి 50 శాతం కమీషన్‌ తీసుకున్నారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఉత్తమ్‌ చెప్పారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)