Breaking News

మా కోటా మాకివ్వాల్సిందే

Published on Sun, 09/24/2023 - 02:22

సాక్షి, హైదరాబాద్‌: రానున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తమకు తగిన ప్రాధాన్యమివ్వాల్సిందేనని కాంగ్రెస్‌ బీసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోమా రు తమ గళాన్ని వినిపించేందుకు ఆదివారం కాంగ్రెస్‌ బీసీ నేతలు గాందీభవన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, పొన్నా ల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్, మహేశ్‌కుమార్‌ గౌడ్, సురేశ్‌ షట్కార్, పొన్నం ప్రభాకర్, కొండా మురళీ, సురేఖ, ఎర్ర శేఖర్‌ తదితరులు హాజరవుతారని ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి శనివారం విలేకరులకు తెలిపారు.

ఈసారి ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గానికి రెండు స్థానాలు చొప్పున 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం బీసీ నేతల జాబితాను టీపీసీసీ రూపొందించింది. ఈ జాబితాలో 40–42 మంది పేర్లుండగా, ఇందులో కనీసం 34 మందికి క చ్చితంగా టికెట్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఇటీవల జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాల్లో చర్చించిన అనంతరం 10 మంది పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని, మిగిలిన పేర్లపై తదుపరి సమావేశాల్లో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన కోసం ప్రతిపాదించిన పేర్లు ఇవీ... 
పొన్నాల లక్ష్మయ్య (జనగామ), కొండా సురేఖ (పరకాల), మధుయాష్కీగౌడ్‌ (ఎల్బీనగర్‌), అంజన్‌కుమార్‌ యాదవ్‌ (ముషీరాబాద్‌), పొన్నం ప్రభాకర్‌ (హుస్నాబాద్‌), సురేశ్‌ షెట్కార్‌ (నారాయణఖేడ్‌), ఈరవత్రి అనిల్‌ (బాల్కొండ), ఎర్ర శేఖర్‌ (జడ్చర్ల), ఆది శ్రీనివాస్‌ (వేములవాడ), బి. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ (నిజామాబాద్‌ అర్బన్‌), గండ్రత్‌ సుజాత (ఆదిలాబాద్‌), కాసుల బాలరాజు (బాన్సువాడ), కత్తి వెంకటస్వామి (వరంగల్‌ ఈస్ట్‌), నందికంటి శ్రీధర్‌ (మల్కాజ్‌గిరి), పోతంశెట్టి వెంకటేశ్‌ (భువనగిరి), కాటా శ్రీనివాస్‌ (పఠాన్‌చెరు), గాలి అనిల్‌కుమార్‌ (నర్సాపూర్‌), అనిల్‌ కుమార్‌ యాదవ్‌ (ముషీరాబాద్‌), మక్కన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ (రామగుండం), ఎ. సంజీవ్‌ (మహబూబ్‌నగర్‌), కాటం ప్రదీప్‌కుమార్‌ (దేవరకద్ర), వాకిటి శ్రీహరి (మక్తల్‌), వీర్లపల్లి శంకర్‌ (షాద్‌నగర్‌), కడెంపల్లి శ్రీనివాస్‌ (షాద్‌నగర్‌), ఎం.వేణుకుమార్‌ (రాజేంద్రనగర్‌), ఎడవల్లి కృష్ణ (కొత్తగూడెం), నాగ సీతారాములు (కొత్తగూడెం), బీర్ల అయిలయ్య (ఆలేరు), నేరెళ్ల శారద (కరీంనగర్‌), జె.జైపాల్‌ (శేరిలింగంపల్లి), ఆనందరావు పాటిల్‌ (ముధోల్‌), అంబటి రాజేశ్వర్‌ (నిర్మల్‌), ఎం.చంద్రశేఖర్‌గౌడ్‌ (నిజామాబాద్‌ రూరల్‌), ఆంజనేయు లు (నర్సాపూర్‌), కత్తి కార్తీక (దుబ్బాక), నగేశ్‌ ముదిరాజ్, సంగిశెట్టి జగదీశ్వరరావు (ముషీరాబాద్‌), మెట్టు సాయికుమార్‌ (గో షామహల్‌), లక్ష్మణ యాదవ్‌ (అంబర్‌పేట), ధర్మపురి సంజయ్‌ (నిజామాబాద్‌ అర్బన్‌).  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)