Breaking News

‘పొత్తు’ పొడిచేనా!

Published on Mon, 10/30/2023 - 03:35

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? లేదా? అన్న సందిగ్ధత ఏర్పడుతోంది. సీపీఐ విషయంలో స్పష్టత వచ్చినా, సీపీఎంకిస్తామన్న రెండుస్థానాల్లో మిర్యాలగూడ ఖరారు చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. వైరా స్థానంపై ఎటూ తేల్చకపోవడంతో ఆదివారం సీన్‌ మారిపోయింది. వైరా ఇవ్వనిపక్షంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని సీపీఎం స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో అసలు వామపక్షాలు, కాంగ్రెస్‌ మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. 

సీపీఐ మౌనం..
సీపీఐ, సీపీఎంలకు రెండేసి చొప్పున అసెంబ్లీ స్థా నాలు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించింది. అయితే వామపక్షాలు కోరుకున్న విధంగా స్థానాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కోరగా, కాంగ్రెస్‌ పార్టీ కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు కేటాయించింది. సీపీఎం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలు ఇవ్వాలని కోరగా మిర్యాలగూడ మాత్రమే సాధ్యమవుతుందని, మిగిలిన రెండింటిలో ఏ సీటూ ఇవ్వలేమని కాంగ్రెస్‌ తేల్చిచెప్పింది. ఆ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది.

దీంతో వైరా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్టు భావించినా ఒక్కరోజులో పరిస్థితి మారింది. తాజా పరిణామాలపై సీపీఐ మౌనంగా ఉంది. ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కాగా ముందు ప్రకటించిన చెన్నూరు స్థానం కూడా సీపీఐకి కేటాయించే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. అదే నిజమైతే సీపీఐ వైఖరి కూడా మారే అవకాశముందని చెబుతున్నారు. ఒక వేళ చెన్నూరు ఖరారైతే కాంగ్రెస్‌తో ముందుకు వెళుతుందా? సీపీఎంతో ముడిపెడుతుందా? అనే చర్చ జరుగుతోంది.

సహకారంపై సందేహాలు
పొత్తు కుదిరినా కాంగ్రెస్‌ ఏమేరకు సహకరిస్తుందోనన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే మిర్యాలగూడలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిని ఆ పార్టీ అనధికారికంగా ప్రోత్సహిస్తోందని సీపీఎం వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెంలోనూ అలాంటి పరిస్థితే నెలకొందని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇలాగైతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రెబల్‌ అభ్యర్థులను ప్రోత్సహించకూడదనే షరతును కాంగ్రెస్‌ పార్టీ ముందు పెట్టాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)