Breaking News

మల్ల దోఖా చేసేందుకు వస్తున్నరు: సీఎం కేసీఆర్‌

Published on Mon, 11/06/2023 - 19:19

సాక్షి, నారాయణపేట: పాలమూరును నాశనం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘ఇక్కడి నుంచి ఎంతో మంది మంత్రులు ఉండె.. కానీ ఒక్క పని చేయలేదు. ఒక్కడు కూడా జై తెలంగాణ అన్న పాపాన పోలేదు. ఇపుడు మల్ల దోఖా చేసేందుకు వస్తున్నారు. మన భవిష్యత్ బాగుండాలంటే బీఆర్‌ఎస్‌ మాత్రమే శ్రీరామ రక్ష. 

కరెంటు మూడు గంటలు ఉండాల్నా.. 24 గంటలు కావాల్నా.. 24 గంటలు కావాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలె. రైతుల భూములు కాపాడాలని ధరణి తెచ్చాం. ఇపుడు ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. నారాయణపేట హైదారాబాద్ తర్వాత మున్సిపాలిటీ గా ఏర్పడిన మొదటి పట్టణం. ఉమ్మడి ఏపీలో అప్పట్లో నారాయణ పేట ఎడారిని తలపిస్తుండే.  కాంగ్రెస్ పాలకులే నాశనం పట్టించారు. తెలంగాణ వచ్చినంక ఒక్కొక్కటి సర్దుకుంటున్నం. ఏడెనిమిది నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాల్వ పనులు పూర్తి అయితయి. నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌ నియోజకవర్గాలకు నీళ్లొస్తయ్‌’ అని కేసీఆర్‌ అన్నారు. 

రాహుల్‌ గాంధీకి ఎద్దున్నదా తెల్వనీకి...
‘జోగులాంబ తల్లి ఒక శక్తి పీఠం. అందుకే జిల్లాకు  అమ్మవారి పేరు పెట్టాం. తిరుపతి వెంకట కవులను సన్మానించిన చరిత్ర గద్వాలది. గద్వాలను గబ్బు పట్టించిన గబ్బు నాయళ్లు ఎవరు? ఆ పార్టీల చరిత్ర కూడ తెలుసుకోవాలి. కృష్ణా, తుంగభద్ర నదులను ఎటు కాకుండగా ఆగం చేసిందెవరు. ఇక్కడి నాయకులు ఆంధ్ర నాయకులకు మంగళహారతులు పట్టిండ్రు. రాహుల్ గాంధీకి వ్యవసాయం గురించి తెల్వడానికి ఆయనకు ఎద్దు ఉన్నదా? వ్యవసాయం ఉన్నదా? పాత పాలమూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో వాల్మీకి బోయలున్నారు. వారిని ఎస్టీల్లో కలపాలని అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి పంపినా ‍ప్రధాని మోదీకి  చీమ కుట్టినట్టు కూడా లేదు’ అని కేసీఆర్‌ గద్వాల సభలో మండిపడ్డారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)