Breaking News

ఆ పెద్దమనిషి ఇంటర్వ్యూ చూస్తే ముసలి పులి కథే గుర్తొచ్చింది

Published on Wed, 04/26/2023 - 12:55

సాక్షి, అనంతపురం: ఒక ముసలాయన.. ఈ మధ్య జాతీయ మీడియాకు వచ్చి రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాటలు వినేప్పుడు.. నాకొక కథ గుర్తుకొచ్చింది. అది మన అందరికీ ఇష్టమైన, నీతిని పంచే పంచ తంత్రంలోని కథ.. 

అనగనగా ఓ పులి ఉండేదట. ఆ పులి మనిషి మాంసం ఒక పద్థతి ప్రకారం రెగ్యులర్‌గా తినేది. సంవత్సరాలుగా నరమాంసం తినేందుకు అలవాటుపడ్డ పులి.. ఏళ్లు గడిచాక ముసలిదైపోయింది. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక పోయింది. ఉన్నచోటే కూర్చుని.. నాలుగు నక్కలను తోడేసుకుంది. మనుషుల్ని ఎలా తినాలనే ప్లాన్‌ వేసుకుంది. దారిలో ఓ ముడగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగల్ని ఆశ చూపెట్టేది.. ‘‘తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి’’ అంటూ ఊరించేది. ‘‘ఈ పులిని నమ్మాం అంటే.. తినేస్తుంది కదా’’ అని అందరూ నమ్మకుండా పోయారు.

కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్‌ మోస్ట్‌ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదు. పైగా వయసు పెరిగింది. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదతో ఇరుక్కుంటే.. పులి చంపేసి తినేసేది.  

ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు ఆడేవారిని, వంచకుల్ని, మాయమాటలు చెప్పేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ కథ వింటే గుర్తొచ్చేది.. అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు.. 

వేటాడే శక్తి కోల్పోయిన పులి, గుంట నక్కల్నివెంటేసుకుని తిరిగినట్లు ఉంది చంద్రబాబు తీరు. బంగారు కడియం ఇస్తానంటాడు. జాబు రావాలంటే బాబు రావాలంట.. బాబుకు ఎప్పటికీ బుద్ధిరాదని అనిపిస్తోంది. నేను సీనియర్‌ని, ఇప్పుడు మంచోడ్ని అయ్యాను అంటూ నమ్మించే యత్నం చేస్తాడు. కానీ,   చంద్రబాబు లాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదు అని సీఎం  జగన్‌ పిలుపు ఇచ్చారు.

పంచతంత్రం కథల్లోని ముసలి పులి లాంటి వాడు మన సీనియర్‌ మోస్ట్‌ పోలిటీషియన్‌. మనిషి మాంసం రుచి మరిగిన పులి మారిందంటే ఎలా నమ్ముతారు?. బాంగారు కడియం ఆశచూపి మనుషుల్ని మింగేసే ఆ పులి బాపతే ఈ వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు. 

బాబు వచ్చాడు.. రైతుల్ని నట్టేట ముంచాడు
పంచతంత్ర కథల్లో నీతి నేర్చుకుంటాం. రోజూ రాజకీయాల మధ్య మనం బతుకున్నాం.  చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల్ని నండా ముంచారు. అక్కాచెల్లెమ్మల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయప్పుడు. సున్నా వడ్డ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండి చేయి చూపాడు.  ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరిన్ని అబద్ధాలు చెబుతాడు. దోచుకో, పంచుకో.. ఇదే చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికి తోడుగా దత్తపుత్రుడు.. ఇది గజదొంగల ముఠా. బాబు అబద్ధాలను, మోసాలను నమ్మకండి. జగనన్న వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోండి.. ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మ విశ్వాసం ప్రజలే అని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి అని ఆయన ప్రజలను కోరారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)