Breaking News

‘తోడేళ్లన్నీ కలిసి చీకటి యుద్ధం.. పెత్తందార్ల కోసం టీడీపీ.. పేదల కోసం నేను’

Published on Thu, 04/20/2023 - 04:22

నౌపడ నుంచి సాక్షి ప్రతినిధి/అరసవల్లి/ సంతబొమ్మాళి/కోటబొమ్మాళి: ‘తమ పాలనలో ప్రజ­లకు ఫలానా మంచి చేశామని చెప్పుకోలేని వారు, మంచి చేయలేని వారంతా ఇప్పుడు ఏకమవుతున్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉ­న్నా­డు. తోడేళ్లలా ఏకమై ఈ రోజు ఒక అబ­ద్ధాన్ని పదేపదే చెప్పి, అదే నిజమని నమ్మించే చీకటి యు­ద్ధం రాష్ట్రంలో జరుగుతోంది.

ఈ చీ­కటి యు­ద్ధాన్ని గమనించండి’ అని సీఎం జగన్‌ అ­న్నారు. బుధవారం ఆయన మూలపేట పోర్టు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి­న అనంతరం ప్రజలనుద్దేశించి మా­ట్లా­డారు. ‘ఈ రోజు పెత్తందార్ల పక్షాన నిలబడ్డ టీడీపీకి, పేదవాడి పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు మ«­ద్య యు­ద్ధం జరుగుతోంది.

వ్యవస్థల మేనేజ్‌ను నమ్ముకున్న వారికి, ప్రజలను నమ్ముకుని ప్రజల కోస­మే బతుకుతున్న మీ బిడ్డకు మధ్య యుద్ధం జ­రుగుతోంది. వారి మాదిరిగా మీ బి­డ్డ­కు ఈ­నా­డు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేవు. ద­త్తపుత్రుడూ లే­డు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నా నమ్మకం,నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది ఒ­క్క దేవుడి దయ, మీ అందరి ఆశీస్సు­లు మా­త్రమే. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి.

కా­నీ మీ బిడ్డకు భయం లేదు. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా­ను. ఈ అబద్ధాలను నమ్మకం­డి.వీళ్ల మా­దిరి­గా అబద్ధాలు చెప్పే అలవా­టు మీ బి­డ్డ­కు లేదు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లే­దా? అన్నది ఒక్క­టే కొలమానంగా తీ­సు­కోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బి­డ్డకు తో­డుగా నిలబడండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా కదలండి’ అని కోరారు. 

పేరుపేరునా పలకరింపు 
మూలపేట పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చి­న మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రతినిధు­లతో సీఎం ఆప్యాయంగా మాట్లాడారు. పేరు పేరునా పలకరిస్తూ.. భూ­ము­లు ఇచ్చిన వారి త్యాగాలు చరిత్రలో నిలిచి­పోతాయని చెబుతూ ధన్యవాదాలు తెలిపారు. వారంతా బహిరంగ సభలో సీఎం జగన్‌ను సత్కరించారు. సంప్రదాయ బోటు జ్ఞాపిక, శ్రీవారి ప్రతిమ అందజేశారు. కాగా, పోర్టు నిర్వాసితులు 594 మందికి నౌపడ వద్ద 58 ఎకరాల్లో పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు.

రూ.34.98 కోట్లతో ప­నుల ప్రారంభానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స , గుడివాడ, ధర్మాన, అంబటి, సీదిరి, సీఎం ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)