Breaking News

ప్రచారంలో బీజేపీ స్పీడ్‌.. కాంగ్రెస్‌పై సీఎం యోగి ఫైర్‌.. 

Published on Sun, 11/05/2023 - 13:47

రాయ్‌పూర్‌: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఫుల్‌ బిజీగా ఉన్నాయి. మరోవైపు.. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అక్కడ బీజేపీ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కవార్ధాలో బీజేపీ సభలో సీఎం యోగి మాట్లాడుతూ..‘ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కొనసాగుతోంది. అక్కడ లవ్‌ జిహాద్‌ పూర్తిగా నిషేధం. దీనికి వ్యతిరేకంగా చట్టం చేశాం. ఛత్తీస్‌గఢ్‌లో కూడా లవ్‌ జిహాద్‌, గోవుల అక్రమ రవాణా, మైనింగ్‌ మాఫియాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌ను ఇంటికి పంపి.. బీజేపీని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇక్కడ కూడా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని మిమ్మల్ని కోరుతున్నాను. 

ఆనాడు ప్రధాని వాజ్‌పేయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం చొరవతో ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడింది. రమణ్‌ సింగ్‌ నాయకత్వంలో 15 ఏళ్లు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచింది. అయితే, ఐదేళ్లుగా ఇక్కడ అభివృద్ధికి కాంగ్రెస్‌ అడ్డుపడుతూ.. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సలిజం, అవినీతి,  బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. దేశానికి కాంగ్రెస్‌ పెద్ద సమస్య. సుపరిపాలన, అభివృద్ధి, శాంతి భద్రతలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రమే చూడగలం. ఛత్తీస్‌గఢ్‌తో ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పవిత్ర భూమిపై ప్రజలకున్న విశ్వాసాలతో కాంగ్రెస్‌ ఆడుకోవడం దుర్మార్గం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీ: వాయు కాలుష్యం ఎఫెక్ట్‌.. స్కూల్స్‌ బంద్‌

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)