Breaking News

ఇక సీఎం యోగి సారథ్యంలో.. తొలి ర్యాలీ అక్కడి నుంచే..

Published on Sat, 03/23/2024 - 16:14

లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో​ బీజేపీ త్వరలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పర్యటనలతో ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. 

రాష్ట్రంలో ఇక పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యం వహించనున్నారు. మధుర నుంచి కాషాయ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. హోలీ వేడుకలు ముగిసిన వెంటనే ప్రారంభం కానున్న ఈ ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ పార్టీ ఓటర్లకు చేరువ కావడంలో చురుకైన పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. 

మార్చి 27 నుండి ప్రారంభమయ్యే ప్రబుద్ధ వర్గ సమ్మేళనానికి సీఎం యోగి నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఆయన శ్రేణులకు వివరిస్తారు. వివిధ ప్రాంతాలలో ప్రతిరోజూ మూడు సమ్మేళనాలు జరగనున్నాయి. మార్చి 27న మీరట్, ఘజియాబాద్‌ల సందర్శనల తర్వాత, మార్చి 28న బిజ్నోర్, మొరాదాబాద్, అమ్రోహాలో సమావేశాలను ప్రతిపాదించారు. 

మార్చి 29న షామ్లీ, ముజఫర్‌నగర్, సహరాన్‌పూర్‌, మార్చి 30న బాగ్‌పత్‌, బులంద్‌షహర్, గౌతమ్ బుద్ధ నగర్, మార్చి 31 బరేలీ, రాంపూర్, పిలిభిత్‌లలో పార్టీ సమావేశాలు జరగనున్నాయి.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల పర్యటించారు. అజంగఢ్ నుండి దేశవ్యాప్తంగా రూ. 42,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)