Breaking News

‘యువత బీజేపీ ట్రాప్‌లో పడొద్దు.. కాంగ్రెస్‌ను గెలిపించండి’

Published on Fri, 02/06/2026 - 21:12

నిజామాబాద్: యువత బీజేపీ ట్రాప్‌లో పడొద్దని, కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌లో ఒక కార్పొరేషన్‌తో పాటు 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు సీఎం రేవంత్‌. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 6వ తేదీ) కాంగ్రెస్‌ సభలో సీఎం రేవంత్‌ ప్రసంగిస్తూ.. ‘ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి నినాదం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. గొప్ప గొప్ప నాయలకులు నిజమాబాద్ నుండే వచ్చారు. 2014 నుండి కేంద్రం, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీలు పాలించినా..  నిజమాబాద్ కార్పొరేషన్ లో అభువృద్ధి జరగలేదు. 

అంకపూర్ దేశి చికెన్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు. వ్యవసాయనికి పెట్టింది పేరు నిజమాబాద్. నిజమాబాద్ పసుపు బంగారంతో సమానం. నిజమాబాద్ జిల్లా వ్యవసాయం దేశానికే ఆదర్శం. పంజాబ్, హర్యానా రైతుల వలే చైతన్యం ఉన్న రైతులు ఈ జిల్లాలో ఉన్నారు. నాడు వైఎస్, డిఎస్.. ద్వయం కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారో... అలాగే నేను, మహేష్ కుమార్ గౌడ్ కలిసి మళ్ళీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాం. అందరి సహకారంతో కాంగ్రెస్ ఆధికారంలోకి వచ్చింది.  నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి నిజమాబాద్ జిల్లానే కారణం. 

నిజమాబాద్ జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం, జిల్లా అభివృద్ధి బాధ్యత నాది. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాం. రూ.1045 కోట్ల రూపాయలతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాం. మున్సిపల్ మంత్రిగా అభివృద్ధి బాధ్యత. రెండు సార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ జిల్లాకు ఏమి చేశారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)