Breaking News

తొలిసారి కాదు .. రెండో సారి ఎన్నికల్లో గెలవడం గొప్ప .. సీఎల్పీలో రేవంత్‌

Published on Wed, 03/12/2025 - 16:56

సాక్షి,హైదరాబాద్‌ : ‘మొదటి సారి ఎన్నికల్లో గెలవడం గొప్పకాదు.. రెండో సారి గెలవడం గొప్ప’అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సీఎల్పీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలు సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతా.  

వచ్చే నెల 6 నుండి  జిల్లాల వారిగా జిల్లా ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు,ఎంపీలు ,ఇతర ప్రజాప్రతినిధులతో లంచ్ మీటింగ్‌లు పెట్టుకుందాం. స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై చర్చిద్దాం. మంత్రుల నియోజవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయి అనే భావన చాలా మందిలో ఉంది. ఈ బడ్జెట్ సమావేశం లో అలా జరగదు.ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇస్తాం.మొదటి సారి గెలవడం పెద్ద విషయం కాదు.రెండవసారి గెలవడం గొప్ప విషయం.మంత్రులు తప్పనిసరిగా హౌస్‌లో  ఉండాలి.మొక్కుబడిగా హాజరుకావడం మంచిది కాదు’అని సూచించారు. 
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు