Breaking News

పదేళ్లు అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

Published on Sun, 09/15/2024 - 05:32

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలు వరుసగా  రెండుసార్లు అవకాశం కల్పిస్తూ వస్తున్నారని, తాము కూడా పదేళ్ల పాటు అధికారంలో ఉండి మంచి పాలనతో పేదల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్‌ సైఫుల్లా రహా్మనీ రచించిన ‘ప్రాఫెట్‌ ఫర్‌ ద వరల్డ్‌ (ప్రపంచానికి ప్రవక్త)’పుస్తకాన్ని సీఎం రేవంత్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం నిరంతరం విషం చిమ్ముతుంటారని.. ప్రజల పక్షాన మాట్లాడేవారి కంటే విషం చిమ్మేవారు ఎక్కువైపోయారని వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

మజ్లిస్‌ కలసి రావడం ఆనందంగా ఉంది 
ప్రభుత్వాన్ని నడిపించడంలో కొన్ని తప్పిదాలు జరగవచ్చని, వాటిని ఎత్తి చూపేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో అంతా కలిసి రావాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ రాజకీయంగా విభేదించినా.. తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కలసి రావడం అనందంగా ఉందని చెప్పారు. 

మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో కొందరు పేదలు నివాసాలు కోల్పోయే అవకాశం ఉందని, వారికి ప్రభుత్వపరంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని రేవంత్‌ ప్రకటించారు. అన్ని మతాలు చెప్పింది ఒక్కటేనని, అందరం కలసిమెలసి శాంతియుతంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, టెమ్రిస్‌ వైస్‌చైర్మన్‌ ఫహీమ్‌ ఖురేïÙ, ఇస్లామిక్‌ స్కాలర్స్‌ పాల్గొన్నారు. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)