Breaking News

కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Published on Wed, 07/24/2024 - 17:11

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలోని సభ్యులకు తీర్మానం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదని, గత ప్రబుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని మండిపడ్డారు.

‘మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీకి వెళ్లాం. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రస్తావించాం. పెద్దన్న పాత్ర పోషించాలని మోదీని కోరాను. మోదీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేది ఏముంది?. రాష్ట్రాలకు పెద్దన్నలగా వ్యవహరించాలని కోరాను
ఎవరి దగ్గర వంగిపోవడమో, లొంగిపోవడమో చేయలేదు. తెలంగాణపై కేంద్రానిది వివక్ష కాదు కక్ష. కొందరు త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు . ఎమ్మెల్యే కాకముందు మంత్రిని చేసింది కాంగ్రెస్‌ కాదా?

పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే.. 45 పైసలు కూడా తిరిగి ఇస్తలేదు. అదే బిహార్‌ రూపాయి చెల్లిస్తే, కేంద్రం తిరిగి రూ. 7 ఇస్తోంది. గుజరాత్‌లో మోదీ తన ఎస్టేట్‌లు అమ్మి మనకు ఏమైనా ఇచ్చారా? తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 3.67 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం నుంచి వచ్చింది రూ. 1.68 లక్షల కోట్లు మాత్రమే. అయిదు దక్షిణాది రాష్ట్రాలు రూ. 22.66 లక్షల కోట్ల పన్నులుచ చెల్లించాయి. పదేళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 6 లక్షల కోట్లే. 

యూపీ రూ. 3.47 లక్షల కోట్లు పన్ను చెల్లిస్తే, అక్కడ కేంద్రం రూ. 6.91 లక్షల కోట్లు ఖర్చు చేసింది. దేశాభివృద్దిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది. ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్‌ కార్యక్రమాన్ని బహిష్కరించాం. పార్లమెంట్‌లో ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి’  అని పేర్కొన్నారు.శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సీఎం ఏమన్నారో ఆయన మాటల్లో..

  • ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారు.
  • వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు.
  • దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు.
  • ఆ తరువాత  సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు.
  • తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.
  • విభజన హామీలు అమలు  చేయడంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.
  • రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే  కేంద్ర పెద్దలను కలిసి మా విజ్ఞప్తులు ఇచ్చాము.
  • ఎవరి దయా దాక్షిన్యాలతో నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదు..
  • ఎవరినో పెద్దన్న అంటే నాకు ఈ పదవి రాలేదు..
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని కలిశా.. 18సార్లు కేంద్ర మంత్రులను కలిశాం.
  • తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.
  • ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు...
  • తెలంగాణపై కేంద్రానిది వివిక్ష మాత్రమే కాదు.. కక్ష పూరిత వైఖరి...
  • కొంతమంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారు...
  • ఎమ్మెల్యే కాకుండానే కొందరికి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని వాళ్లు గుర్తుంచుకోవాలి.
  • తెలంగాణ ఒక రూపాయి పన్ను  చెల్లిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది 43 పైసలే.. బీహార్ కు రూ.7.26 పైసలు.
  • తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే... కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1లక్షా 68వేల కోట్లు మాత్రమే..
  • మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి.
  • అయిదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత?
  • దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22లక్షల 26 వేల కోట్లు
  • కేంద్రం ఐదు రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6లక్షల 42వేల కోట్లు మాత్రమే.
  • యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చేది రూ.3 లక్షల 41వేల కోట్లు మాత్రమే..
  • కానీ యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 91వేల కోట్లు.
  • ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ.. ఇదీ కేంద్రం వివక్ష..
  • దేశం 5ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం.
  • మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాం.
  • ఐఐఎం,  సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు.
  • సభలో పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది మాట్లాడటం శోచనీయం.
  • అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు..
  • రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడంలేదు.
  • కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేశాం.
  • తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)